నిన్నటిదాకా నన్ను
కలవళపెట్టిన జ్ఞాపకాలను
ఇవ్వాళ ఉతికి దండెమ్మీదన ఆరేసాను.
కానీ ఆ మగ్గువాసన ఇంకా వదిలినట్లు లేదు.
ఐనా మళ్ళీ చీకటిపడేసరికి
ఆజ్ఞాపకాల దుప్పటినే ఇవ్వాళకూడా
కప్పుకోవాలి గదా తప్పదు.
మళ్ళీ ఈనాడొచ్చేకలలయినా తన దగ్గరకు
తీసుకెళ్ళి మనసువిప్పి హాయిగా
మాట్లాడిస్తాయేమో చూడాలి.
రోజులుగడుస్తున్నాయేగాని జ్ఞాపకాల వసంతం నాదరినుండి
శిశిర ఋతువువైపు జారిపడుతున్న దాఖాలాలేదు.
హేమంతమైనా శరదృతువైనా పెద్దగా ఇబ్బంది పడననుకుంటా.
వానాకాలంలో ఇంటిచుట్టూ ఆవిడపెంచి పోషించిన పూలమొక్కలన్నీ
కొత్త చిగురులు తొడుగుతూ కొంగ్రొత్తగా పిందెలను పూవులుగా మార్చే
అద్భుతమైన ప్రక్రియ ప్రారంభ మౌతుందిలెమ్మన్న ఆశ.
ఆపూల సుమధుర సౌరభంలోనే ఆమె అనునిత్యం
సాక్షాత్కరిస్తుందన్న ఆశకూడా
నాలో దిన దిన ప్రవర్ధమానమౌతున్నది.
****************************************************

No comments:
Post a Comment