Monday, September 28, 2015

అంతరాంతరస్వనమేదో నాహృదయ కవాటాలను స్పృశిస్తూ
లోలోపల తిరుగాడుతున్నట్లున్న స్పర్శ
నన్ను అనుక్షణం కలవళ పెడుతుంటుమంది.

ఒకానొక అంతశ్చేతన ఆవిర్భవించి మనసుకు పేరుకున్న మాలిన్యాలనన్నింటినీ శుభ్రంగా
 ప్రక్షాళనగావిస్తున్న అనుభూతి
నన్ను నిరుత్తరుడిని గావిస్తూ నింగికెగసిపడుతున్నట్లు
ఓ దివ్య భావన నన్ను పునీతుడిని గావిస్తుంది.


దగద్ధగాయమానంగా ఓ దివ్యమంగళరూపం
ఆవిర్భవించి నన్ను ఆనందోపడిశగా నడిపిస్తూ
సూక్తిసుధాకరమై నన్ను కమ్ముకున్న చీకట్లనుండి
దూరంగా దిగంతాలకవతలి తీరానికి నావలో
పయనైంపజేస్తున్న దృశ్యం నన్ను అచేతడుని గావిస్తుంది.


నిన్నటికీ నేటికీ మధ్యన నిరామయమై నిలిచిపోయే
ఓ నీలి మబ్బుముక్క నేలకురాలిపడుతున్న నన్ను
అప్రతిభుడిగా మార్చి మూగగా నడిపిస్తున్నదేమోనని
నా అంతరంగం నాకు హితబోధచేస్తున్నది.

Friday, September 25, 2015


తెలుగు హైకూ

++++++

ఆమె తనువు

చైత్ర ధనువు

శిశిర తరువు

+++++++++

చలి రాత్రి

ఒంటరినైనా

ఆమె తలపులతో జంటగా

+++++++++++

కవితల్లో

ఆమె సౌందర్యం

చిక్కని హైకు

+++++++++++

వేసవి కాలం

చిల్లుల గొడుగులో

ఆమె ,నేను ,ఆకాశం

++++++++++++

గ్రీష్మం

దినపత్రిక

విసనకర్రలా

++++++++++++

రాలిన ఆకులతో

నిండిన చెత్త బుట్టలు

శిశిర హేల

++++++++++++

కళాత్మక చిత్రం

విరామంలో

నిట్టూరుస్తూ జనం

++++++++++

వేసవికాలం

దిష్టి బొమ్మ

చెమట కంపుతో

+++++++++++++

శబ్దాలు

పర్వతాల

నిశ్శబ్దానికి  గర్విస్తూ

+++++++++++++

సన్నబడే ప్రక్రియలో

బలహీన పడింది

ఆమె కాదు నా పర్సు

++++++++++++++++++

 

 

 

 

 

 

 

 

 

Friday, September 4, 2015

చదువులు నేర్పిన గురువులు
పదిలముగ  నాభాషయందు పరిణతగలుగన్
అధికముగ శ్రమకు నోర్చిన
బుధజనులందరిని నేడు బుద్ధిగ దలతున్
నేనెందుకు అనునిత్యం విలపిస్తానో తెలియదు.

నీ వదానరవిందాన్ని వీక్షించి నప్పుడల్లా
నువ్వే కావాలని పరితపిస్తుంటాను,
కోపారుణనేత్రాలతో నీవు గద్దిస్తుంటావు
అయినా మనసు నువ్వే కావాలని నిరంతరంతపిస్తుంది.

నువ్వు చిరాకు పడినా సరే చిరునవ్వుతో మనసు దానిని  స్వీకరిస్తుంది.

ఎందుకిలా జరుగుతున్న దంటావ్?
కొంపదీసి నేను నిన్ను    నిన్ను గాఢంగా ప్రేమించానంటావా?
-----------------------------------------------------------------------------------------------
ఎన్ని సార్లు అద్దంలోకి తొంగిచూసినా
నీరూపమే సాక్షాత్కరిస్తున్నది ఎందుకని?
నువ్వూ నేనూ మమేకమై తాదాత్మ్యంజెంది
ఏకరూపులుగా రసరమ్య రాజ్యంలో
రాజుకుంటూ ఉన్నామని అద్దానికీ
అర్ధమయి పోయిఉంటుందంటావా? నిజంచెప్పు!!

Thursday, September 3, 2015

అండగ నీవేవుండగ
దండగ వేరొకరి కరుణ  భండనమున
కొండను బోలిన యా హను
ముండను వీక్షించి మగడుమోదమునందెన్.
అండగ నీవేవుండగ
దండగ వేరొకరి కరుణ  దానవవైరీ
కొండను బోలిన యా రా
ముండను వీక్షించి మగడుమోదమునందెన్.
ఉదయసంధ్య------
================

తమలోతామే మాట్లాడుకునే తరుసమూహం.

మౌనాన్నాశ్రయించిన చీకటిరాత్రులు
ఆత్మానుసంధాయకమైన సంగీత స్వరాలు.
ఎదురుగా రాజుకుంటున్న బొగ్గులకుంపటి.
దగ్గర్లో సోఫాలో ఓ మూలన కూలబడిననేను.

ధారాపాతంగా కారుతున్న కన్నీరు.
ఆపాలని ఎంతగాశ్రమించినా ఆగడంలేదు
లోపలికి ప్రవేశించి తీవ్రంగా చొచ్చుకుపోతున్న నొప్పి.
మాటలు ససేమిరా  పెగలడంలేదంటూ  భీష్మించుకు కూర్చున్న సమయం.
చందమామ నిస్సత్తువగా వాలిపోయి తారలు ఆకాశంలో
పరిచిన తివాసీపై ఒక్కుదుటున రాలిపడిపోతూ.

దుమ్మూ ధూళీతో క్రమేపీ విస్తరిస్తూ పోతున్న చీకటి.
పర్వతాలవెనుకగా ఉదయించడానికి సిద్ధమౌతున్నదినకరుడు.
కువకువలాడుతూ సందడిచేస్తున్న విహంగ తతి సామూహికంగా
సుప్రభాత శ్లోకాలను వల్లిస్తూ మేల్కొల్పు గీతాలను పాడుతూ.
కొంగ్రొత్తరోజుకు శుభ స్వాగతం పలుకుతున్న క్షణాలు.
ఇక వెనుదిరిగిచూసుకోవాల్సిన అవసరమే లేదు.
ఇక ధరిత్రిమీద పాదాలను మోపబోతున్నానన్న ధీమాతో
చిరుదరహాసాలను కొంగ్రొత్త చిగురులుగా తొడుక్కుని సంతసంగానేను.
ఉదయసంధ్యను హృదయంగా చేసుకోవాలని
 ఉవ్విళ్ళూరుతూ  నా అంతరంగం.
[ఓ ఆంగ్లకవిత ఆధారంగా]
===========================

Wednesday, September 2, 2015

అత్యంత భక్తి శ్రద్ధలతో
అమ్మవారి చిత్రపటాన్ని
నగర సంకీర్తనలను గావిస్తూ భక్తులు కొందరు

ఊరిలోని వీధులన్నింటా కలయదిరుగుతున్నారు.

అమ్మ వారిని చూడగానే పసుపూ కుంకుమలతో
ప్రతినిత్యం సాక్షాత్కరించే నువ్వే గుర్తుకొచ్చావు.

అహ్టోత్తరశతనామాలతో స్తోత్రపాఠాలు వల్లించె భక్త
బృందంలో నువ్వున్నావేమోననిదీక్షగా వెదికాను.

నువ్వెక్కడా దర్శనమివ్వలేదు.అమ్మవారి
నవ్వులో నువ్వు దాగుంటావని తెలియక భ్రమకులోనయాను.

అమ్మ వారి పాదాలచెంత వినమ్రంగా తలను వాల్చి
మొక్కులు తీర్చుకుంటున్న భక్తిప్రసూనం నీవేకదా?

మనసునిండా సంతోష సాగరాలను నింపుకుని
వినయ విధేయతలతో ఇంటిముఖం పట్టాను.
===============================================

Tuesday, September 1, 2015

నిన్నటిదాకా నన్ను
కలవళపెట్టిన జ్ఞాపకాలను
ఇవ్వాళ ఉతికి దండెమ్మీదన  ఆరేసాను.



కానీ ఆ మగ్గువాసన ఇంకా  వదిలినట్లు లేదు.

ఐనా మళ్ళీ చీకటిపడేసరికి
ఆజ్ఞాపకాల దుప్పటినే ఇవ్వాళకూడా
కప్పుకోవాలి గదా తప్పదు.

మళ్ళీ ఈనాడొచ్చేకలలయినా తన దగ్గరకు

తీసుకెళ్ళి మనసువిప్పి హాయిగా
మాట్లాడిస్తాయేమో చూడాలి.
రోజులుగడుస్తున్నాయేగాని జ్ఞాపకాల వసంతం నాదరినుండి
శిశిర ఋతువువైపు జారిపడుతున్న దాఖాలాలేదు.
హేమంతమైనా శరదృతువైనా పెద్దగా  ఇబ్బంది పడననుకుంటా.
వానాకాలంలో ఇంటిచుట్టూ ఆవిడపెంచి పోషించిన పూలమొక్కలన్నీ
కొత్త చిగురులు తొడుగుతూ కొంగ్రొత్తగా పిందెలను పూవులుగా మార్చే
అద్భుతమైన ప్రక్రియ ప్రారంభ మౌతుందిలెమ్మన్న ఆశ.

ఆపూల సుమధుర సౌరభంలోనే ఆమె అనునిత్యం
 సాక్షాత్కరిస్తుందన్న ఆశకూడా
 నాలో దిన దిన ప్రవర్ధమానమౌతున్నది.
****************************************************

Where are you my beloved?
Why do you prefer tohide?

I  searched for you in these woods
and couldn't find you even behind the woods.

I  eagerly waited for you on the hilltops
and on the difficult cliffs of THOSE mountains.
But nothing except the hovering of clouds
ahigh above my head is really  visible to me my l0rd!!

Tellme the truth,where are you hiding now?.

I  am becoming restless and am getting terribly tired.

Give me a chance to locate you at least in this eleventh hour!!
===========================================

Thursday, August 27, 2015

ఒక దశాబ్దం క్రింద
-----------------
దరహాస చంద్రికలనన్నింటినీ
మన ఇంటి ద్వారబంధం వెనుక
దండెం పై ప్రేమపురస్సరంగా
వ్రేలాడదీసిన మధురాతి
మధుర క్షణాలు.
 ముఖద్వారం తోసుకుని
ముందుకు నడవగానే
ముసి ముసి నవ్వులతో
ముఖపరిచయాలు.
ముప్పిరిగొని ఉక్కిరి
 బిక్కిరిగావించి
ఊపిరాడకుండా చేసిన
 ఉత్తమ ఘడియలు.

గోడకు వేలా డుతూ నవ్వుతూ
పలకరిమంచే [మా నాన్న[గారి]
చిరుదరహాసాల చాయా చిత్రం.

ముందు వసారాలోకడుగిడగానే
పునర్దర్శన భాగ్యం ప్రాప్తిరస్తు
అంటూ దీవించిన సుహృన్మిత్రులు పుస్తకాల
పూర్ణచంద్రికల పూర్ణ కుంభపు స్వాగతాలు.
ఆగదివెనుకగా 108 రకాలపూలతో
 నీవుభక్తి పురస్సరంగా వల్లించిన
అష్టోత్తర శతనామాల సం రంభాల
లలితాదేవి,శ్రీలక్ష్మి అమ్మవార్లు
 దిటవుగా ఆశీర్వదించిన దీవెనల పరంపరలు.

ఆతరువాత జీవనసౌరభాన్ని కంఠ దఘ్నంగా
పంచిపె ట్టి   న ఆచార్యోత్తముల ప్రవచనల పరీరంభాలు.

ఓ పది అడుగులు ముందుకు పడగానే
మెట్టు మీద పేర్చిన ధాన్యం బస్తాల్లా
నీవు కట్టిన,కట్టవలసిన పట్టు మరియు
నేత చీరెల వరుస దొంతర్లు,,ఇనుప బీరువాలో
ఎక్కిడి తొక్కిడిగా పేచబడి   కలరావుండల మధ్యలో
నాసికాపుటాలను అదరగొట్టే  ఘుమాయింపులు.

ఆతరువాత వున్న శయనమందిరం,
రోజంతా కష్టపడిన శ్రమను మరపిస్తూ
ఆదమరచినిద్రపోయిన సుఖ నిద్రల ఆనవాళ్ళు.

ఒక వేకువ వెల్లువై గవాక్షాల్లోంచి ప్రవహించగానే
ముందున్న పాకశాలనుంచి పరుగులు తీసే ఆంధ్రాకాఫీ
పొగలు,సెగలుగక్కుతూ, గుబాళించే కాఫీకప్పులతో  కరచాలనాలు.
ఇప్పుడు ఓ దశాబ్దం తర్వాత అన్ని జ్ఞాపకాలూ రెండేళ్ళ క్రింద
నీ పరమద యానంతో కన్నీళ్ళమధ్యన మరుగున పడిపోతూ
క్రమేపీ మృగ్యమౌతున్న మధుర స్మృతుల మౌన భంగాలు.
=====================================
ఒక దశాబ్దం క్రింద
-----------------
దరహాస చంద్రికలనన్నింటినీ
మన ఇంటి ద్వారబంధం వెనుక
దండెం పై ప్రేమపురస్సరంఫా
వ్రేలాడదీసిన మధురాతి
మధుర క్షణాలు.
 ముఖద్వారం తోసుకుని
ముందుకు నడవగానే
ముసి ముసి నవ్వులతో
ముఖపరిచయాలు.
ముప్పిరిగొని ఉక్కిరి
 బిక్కిరిగావించి
ఊపిరాడకుండా చేసిన
 ఉత్తమ ధడియలు.

గోడకు వేలాదుతూ నవ్వుతూ
పలకరిమంచే [మా నాన్న[గారి]
చిరుదరహాసాల చాయా చిత్రం.

ముందు వసారాలోకడుగిడగానే
పునర్దర్శన భాగ్యం ప్రాప్తిరస్తు
అంటూ దీవించిన సుహృన్మిత్రులు పుస్తకాల
పూర్ణచంద్రికల పూర్ణ కుంభపు స్వాగతాలు.
ఆగదివెనుకగా 108 రకాలపూలతో
 నీవుభక్తి పురస్సరంగా వల్లించిన
అష్టోత్తర శతనామాల సం రంభాల
లలితాదేవి,శ్రీలక్ష్మి అమ్మవార్లు
 దిటవుగా ఆశీర్వదించిన దీవెనల పరంపరలు.

ఆతరువాత జీవనసౌరభాన్ని కంఠ దఘ్నంగా
పంచిపెట్తిన ఆచార్యోత్తముల ప్రవచనల పరీరంభాలు.
=====================================

Wednesday, August 26, 2015

అహంభో---
============

ఉరవడిగాదుముకుతూ ప్రవహించే
సెలయేటి ధాటికి కూడా కరగని
 కఠినాతి కఠినమైన
 గండ  శిలను నేను.

అంతరంగ మధనంలో
అంతుచిక్కని పదకేళిని.
వివేచనకు అర్ధం తెలుసుకోగలిగిన
వివేక చూడామణినికూడా నేనే.


ఆషాడభూతుల ఆదరణను కాదనుకుంఅహంభో---
============
ఉరవడిగా దుముకుతూ ప్రవహించే
సెలయేటి ధాటికి కూడా కరగని
 కఠినాతి కఠినమైన
 గండ  శిలను నేను.

అంతరంగ మధనంలో
అంతుచిక్కని పదకేళిని.
వివేచనకు అర్ధం తెలుసుకోగలిగిన
వివేక చూడామణినికూడా నేనే.

ఆషాడభూతుల ఆదరణను కాదనుకుంటూ
ఆత్మాశ్రయానందాన్నభవిస్తున్న అంతరాత్మను.
===================================

=================================

Tuesday, August 25, 2015

అశ్రు తర్పణం
----------------------
ఉరవళ్ళతో పరవళ్ళతో
గంగమ్మ
తన భక్తురాలిని
తనలో  నిమజ్జనం చేసుకోవాలని
ఆరాటపడుతూ
మరుక్షణమే ఐక్యం చేసుకోవాలని
హైరాన పడుతూ
-----------------------------------

Friday, August 21, 2015

పునీతo
===========
అతి ప్రాచీనంగానో
అత్యంత ఆటవికంగానో
ఇద్దరం దర్శనమిస్తుంటాం
నేనూ ధరిత్రిమాతా!!

పరిణామక్రమాన్నసురిస్తూ,
పరిభ్రమణలను కొనసాగిస్తూ


ఇరువురం ఎంతగా అలసి సొలసి పోయామో.
రూపు దిద్దుకుంటూ
రూపాన్ని సరిదిద్దుకుంటూ.

భూదేవి నన్ను తయారుచేసిది
తునాతునకలుగా విచ్చేలానూ చేసింది.
తుదకువిచ్చిన్నమూ గావించింది.
మరలా తనే నా పునరుజ్జీవనానికీ
 ఆస్కారాన్నందించింది.

ఎన్నెన్ని భ్రమణాలు?
ఎన్నీన్ని ప్రకంపనల పరంపరలు??
భూదేవి పవిత్ర గర్భంలోంచి
పరిపక్వమైన సుక్షేత్రంగా
ప్రభవించిన పునీతురాలిని నేను.
====================

Thursday, August 20, 2015

చేతుల్లో దిటవుగా పొదవి పట్టుకున్న పాత్రలోంచి
మధురాతి మధురమైన మధువు వొలికిపోయి
యేడాదులు రెండు గడిచాయట.

హృదయ సామ్రాజ్యాన్నేలుతున్న రసరమ్య గీతాన్ని
పాడుకోవడంకోసం తడుముకోవడం మొదలెట్టి
యేడాదులు రెండు యేకంగా గడిచిపోయాయట.

పూలాతోటలో విరబూసిన మూక్కలు ఎండకు తట్టుకోలేక
వాడుముఖం పెట్టి వల వలా యేడ్వడం ప్రారంభించి
సరిగ్గా రెండు గ్రీష్మాలు గడిచిపోయాయట.

నాప్రక్కనే వుంటూ అహోరాత్రాలూ శ్వాసించిన వెన్నెల చందమామ
నల్లటిమబ్బుల మధ్యకు జారిపోయి మసక బారడం మొదలెట్టి
రెండు శిశిరాలు దాటిపోయాయట.

ఇప్పుడు యే భక్తి గీతం నా హృదయకుహరాల్లో
ధ్వనించే అవకాశం మృగ్యం.
అష్టొత్తరాలూ శతనామాలు ఇక నా శ్రవణ పేయంగా
వినబడవని తీర్మానం జరిగిపోయింది.

ఇక ఒంటరితనన్ని ఒదిలోకి చేర్చుకుని మంచు  దుప్పటిని కప్పుకుని
శేషజీవితం గడుపుకోవడమే శ్రేయోదాయకమని
అక్షరసహ ఋజువయిపోయింది.

పాతకాలo లో తనకోసం రాసుకున్న ప్రణయగీతాలనే పదే పదే పాడుకోవడం తప్ప
 ఇంకా రాయగలిగిన గీతాలేం మిగిలిపోయి లేవని ఖాయమయింది.
============================================================
అంతర్వీక్షణం
------------------రావెల

ఆవిడ కన్నుల్లో
అనంతాంబరపు నీలి నీడలు  చూసిన గుర్తంటూ లేదుగాని
సం యమనానికీ సహనానికీ సోదాహరణంగానిలిచిన
సౌహార్దానికి సేతువయిన సమతుల్యతను మాత్రం చూసిన గుర్తు.

పరమపద సోపాన పటంలో నాలుగు దశాబ్దాలుగా
స్వయంకృషితో నిచ్చెనమెట్లను ఒక్కొక్కటిగా ఎక్కుతూ

నిగర్విగా, నిండుమనసుతో కన్నపిల్లలను,తల్లిదండ్రులనూ
అత్తామామలనూ అనురాగాభిమాన పురస్సరంగా మనుమలతో
మనుమరాండ్రతో తాదాత్మ్యంచెందుతూ పరవశించిన శుభ ఘడియలు మార్త్రమే
నా మనో ఫలకంపై ముద్రితమయ్యాయేగాని అనారోగ్యపు సరీసృపాలు
కాటేసి తీరుతాయన్న ఆలోచనగానీ, భయాందోళనలు గానీ పడినగుర్తులు మాత్రం
ఆమె వదనారవిందంలో గమనించిన జాడలు మాత్రం ససేమిరా చూసిన దాఖలాల్లేవు.
 ఎదుటివారి చిరాకు ఎంతటిదయినా చిరునవ్వుతో స్వీకరించి పరిష్కరించగల
సత్తా తనకుందని మాత్రం నాకు సంపూర్ణంగా విశ్వ్వాసమచంచలమైన నమ్మకం.

మల్లెపూవుకన్నా స్వచ్చంగా నవ్వగలిగిన తనకు నవ్వుల నజరానా నందించగలగడం
తప్ప మరేమీ ఇవ్వలేని నా వ్య్ధార్త యదార్ధ హృదయం ఘోషిస్తున్నది.

[[ ఆమె లేకుండా రెండేళ్ళు గడిచాయన్న ఆలోచనను అంతర్వీక్షణం చేసుకుంటూ]

Wednesday, August 19, 2015

జిగీష
---------------రావెల
==============================

అమ్మ ఎలావుంటుందో ఊహించుకోలేని ప్రాయం.
ప్రసవసమయంలో గుర్రపు వాతం వచ్చి
సరయిన వైద్య సౌకర్యాలులేని పల్లెలో
పరమపదించిందని మాత్రం తెలుసు.

అమ్మ చాల అందెగత్తెయని ఒక కులానికీ ఇంకొక మతానికీ
పట్టుబడని సౌహార్ద సేతువనీ అమ్మను గూర్చి

అందరూ ప్రశంసార్హంగా పలుకుమంతూడం మాత్రం విన్న గుర్తు.
యేకోణంలో అందంగా ఉంటుందో మూల్యాంకనంచేయలేని చిరుత ప్రాయం.

ఆరోజు పదకొండుగంటలప్పుడు స్కూలు ప్యూను వీరయ్య
మమ్మల్ను చంకలోవేసుకుని ఇంటిదగ్గర దీనంగా దిగాలుమొహంతో
దించిన గుర్తు మాత్రం మనో ఫలకంపై ముద్రితమై శాశ్వతత్వాన్ని
పుణికి పుచ్చుకుందని మాత్రం ఊహకందుతున్నది.

మొన్న చిన్నతమ్ముడు అకాస్మాత్తుగా అనారోగ్యంపాలై అసువులుబాశాడని తెలిసాక
అక్కయ్య బాధల బస్తీలో మంచానికేపరిమితమైన దశలో
వాడికి అమ్మ ఎలావుంటుందో తెలియని వయసులో అమ్మ అసువులు బాసింది.
ఒఇప్పుడు వాడూ అమ్మదగ్గరకెళ్ళాడని విలపిస్తూ అన్నం ముట్టడంలేదని ఎలిసాక
అమ్మను అక్కలో చూసుకునే యోగానికి దూరమైన మా దురదృష్టానికి పదే పదే
బాధపడుతూ--అంతక్రితం రెందు మూడురోజులముందే అక్కయ్యను చూడాలని
పట్టుబట్టి వెళితే అరేయ్ నీకొడుకు అచ్చం అమ్మలా వున్నడురా అని చెప్పుకుంటూ
మురిసిపోతున్న అక్కయ్య కళ్ళలో అమ్మను చూడగలనేమో నని తహ తహ లాడిన వేళ.



వీడు అచ్చు ఆడపిల్లలా పుట్టివుంటే బావుడేదని గజల్లు పాడిన సుపుత్రుడిని
అభినందిచిన డా/ సి.నా రె.పలుకులు మరలా వేదవాక్కులైశ్రవనానందంకలిగించిన మదురక్షణాలు
మళ్ళే కనుల  ముoదు సాక్షాత్కరించిన మధుర క్షణాలు గుర్తుకొచ్చి
పెదవులపై చిరుదరహాస చంద్రికలను చిరంతనంగా ముద్రించినవేళ.

అప్పటికాలంలో అమ్మ చాయాచిత్రం తీసిన నాధుడెవ్వరూ ఎందుకులేరొనన్న
మారుమూల పల్లె టూరి గుండె ప్రశ్నించిన తీరు విస్మయం కలిగించింది.

స్నానాలగదిలో చెవి దుద్దులో మంగళసూత్రాలో మరిచిపోయి నాన్నచేత
చిరునవ్వులతో చీవాత్లలమంటి మందలింపులను గుర్తు చేసుకుంటూ
ఉదయాన్నే లేవగానే కచ్చికతో పళ్ళుతోముకుని నుదిటన కుంకుం బొట్టుపెట్టుకుని
మంగళసూత్రాలను కళ్ళకద్దుకున్న అమ్మరూపమే మదిలో కదులుతూ కలవరపెడుతూన్న వైనం .
======================================================

Sunday, August 16, 2015

అస్తవ్యస్తంగా---
=====================



జలనిధులింకగాలేనిది
నాకనుకొలకుల్లో జీవనదుల్లా
ప్రవహించే ఈ కన్నీటిజలపాతాలకేం బిగువో
ఒక్కుదుటున ఇంకిపోవెందుకని?
సప్త సంద్రాలను అవలీలగా దాటివచ్చిన

సంతోషం సామ్రాజ్యం చేసినంతకాలం
సద్దుమణిగిపడివున్నాయ్ ఈ ధునులన్నీ
సంతాపం పరంపరగా చేరువవగానే
చిరంజీవుల్లా  చిరంతనం గుండె గొంతులో
గూడుకట్టుకుని నివసిస్తున్నాయ్.కదలిపోమని
భీష్మించుకు కూర్చున్నాయ్!



రెండేళ్ళ క్రిందటిదాకా వాటిజాడ మృగ్యమై వుండేవి
అప్పటినుంచీ ప్రారంభమై పట్టువీడకుండా వస్తున్నాయ్.
పోవడం మాట దేవుడెరుగు పొంచి పొంచిచూడడం
పొందికగా నేర్చుకున్నాయ్ !! వేదనలన్నింటికీ వేదికలుగా మారి వరుసపెట్టి వినిపించుకోకుండా మూకుమ్మడిగా వేధిస్తున్నాయ్.

చివరకుమిగిలేది ఇదేనా అని గడియపడని తలుపులవెనుక
తామతంపరగా పుట్టుకొస్తున్న పుట్టెడు ధు :ఖ తతికి
పూర్ణానుస్వారమై పొందికగా తిష్ట వేసి కూర్చుంటున్నాయ్.

విధిమాత్రం తానేం తక్కువ తినలేదనుకునేలా విషాద స్వరాభిషేకాన్ని వింత వింత సమయాల్లో వినిపించి విసుగును పుట్టిస్తూ తమ వైశద్యాన్ని విస్తరించుకుంటూ పోతున్నది.

అస్తినాస్తి విచికిత్సాహెతువుల మధ్యన ఆశలు క్రమేపీ ఉడిగిపోతున్నాయ్ .. అంచులంటా అధోలోకానికి చేరుకుని
ఆశ్చర్యాన్ని మాత్రం మనకొదిలి అంతులేనికధగా
 అవరోధాల ఒడిలోకిజేర్చి విసుగూ విరామాల చెంతన విశ్రాంత
జీవన యానాన్ని కొనసాగిస్తూ మనలను కొనఊపిరితో
కొట్టు మిట్టాడే లా కుదేసి ముందుకు సాగిపోతున్నయ్.
=============================================




Saturday, August 15, 2015

రంగులు మార్చదు గానీ
హంగునకేంకొదువలేదు హరితపు ధాత్రిన్
చెంగున చెంగున ఎగురును
పింగళి వెంకయ్య సృష్టి పేర్మిని బడసెన్.
-------------
అరువది యెనిమిది దాటెను
ఇరువైపుల శత్రుసేన ఇరుకున బెట్టన్
తరుగని ఖ్యాతిని గాంచెను
పరువముకాపాడుకొనుచు పరుగులు దీసెన్.
----------------------------
బీదల క్షేమము తలచుచు
ఔదల బహుకీర్తి నెరపు విజ్ఞత నేర్చెన్
రాదగుకీర్తిని పొందెను
మీదుగమిక్కిలి ప్రేమసంపద నింపెన్. 

Monday, August 3, 2015

బాపుబొమ్మవోలె భాషించు చెలిమియే
కొత్తపుంతదొక్క కోరుకొనును
మనసు శాంతపరుచు మౌనమ్ము విడిపోవు
చెలిమికాడు చెంత చేరియున్న

Saturday, August 1, 2015

పలుకు పలుకున పులకించు కులుకు తీరు
చిరుదరహాసమాతడి సిరుల గనులు
జాతి హితమునె దలపోసి ఖ్యాతి గనెను
అతడులేడన్న మాటలు అశని పాటు
----------------
wings of fire
burning sins
of his countrymen!!
------------------
భువిని విడనాడి దివికేగె దివ్య సుమము
అతడి పాదాలచెంతనే ఇతడి వృత్తి
మనుజ తతిలోన మంచిని పెంచులాగు
రచనచేసెడు రీతిక రమ్యతరము
=======================
వెలుగుకేసి తిరిగి చూడు
వేదనంతా కరిగిపోతుంది
చీకటిలో వుండి తిట్టుకుంటుంటే
చిత్రవధేమిగులుతుంది.
-----------------------
నిద్రాణమై నిస్తేజంతో
నీరు గారిపోతున్న యువతలో
నిప్పును రగిలించి జ్ఞానాగ్నిని
రేకెత్తించిన ఘనాపాఠి
మతమేదైనా తన అభిమతం
జాతిహితమేనని ప్రకటించిన క్రాంతదర్శి.
విద్యార్ధుల హృదయ సీమల్లో దేశం పట్ల
ఓ అభిమానాన్ని ప్రేమనూ చదువులపట్ల
శ్రద్ధాసక్తులను రేకెత్తించిన సోమయాజి
ఎవ్వరు? ఇంకెవ్వరు?' భారతీయత ను
గౌరవించిన ఘటికావతంసుడు
అతడే మన అకళంకమౌ హృదయ పేటి
ఎవ్వరున్నారు
అతనికి సమీపానికి రాగల సరిపోలు జోడి.

Friday, July 24, 2015

అతడు అలా మూలం విరిగిన చెట్తులా ఆసుపత్రిమంచమ్మీద
నిస్త్రాణగా నిస్తేజంగా నిద్రపోతున్నాడు.

శ్రేయోభిలాషులగణమంతా ంతా అతని ఆరోగ్యంకోసం
ఆ దేవ దేవుడిని సహస్ర శీర్షలతో ప్రార్ధిస్తూ వున్నది.

శస్త్ర చికిత్స అవసరమన్నారు వైద్యులు.
సరే యేమైనా  సరెఏ ఆయన్ను బ్రదికించంజ్డి చాలు
అంటూ కన్నకొడుకు కన్నీరు మున్నీరుగా
 విలపిస్తూ విన్నవించాడు.
అతనిలో చలనం వస్తుందని అందరూ అఖండజ్యోతుల్లా
వెలుగుతున్న కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

అతను నాకు  కావాలని ఆ శ్వేత వస్త్ర ధారి
మొండిగా వాదిస్తూ అత్యవసరమైనవిధంగా  ఆదేశిస్తున్నాడు.

శత సమాధివుత్సవం అతనొక్కడే సమర్ధవంతంగా నిర్వహించగలడని నేను ప్రగాఢంగావిశ్వాసం తో ఉన్నాను.
నన్ను క్షమించండి అతన్నిమీకు మరలా తిరిగి మీకివ్వలేను
నన్ను మన్నించండి అంటూ ఆ శివ రామకృష్ణ హనుందవతార రూపుడు అదృస్యమైపోయాడు. పదుగురి శ్వాసలో అతను అవయవ దానానం చేసినందున ఈ నా అంకిత భక్తుడు  నిక్షేపంగా బ్రదికే వుంటాడు
భౌతికంగా కాకపోయినా తను నమ్ముకున్న ఆధ్యాత్మిక ప్రపంచంలో---

[నా కన్నా చిన్న వాడయిన స్వంత  తమ్ముడిని కోల్పోయానన్న దు: ఖంతో]
======================================================================================

Wednesday, July 22, 2015

భక్త్యంజలి
---------------
నిరంతరం నన్ను నీవు
నీ నేత్రయుగ్మంతో
నాదైనందిన చర్య్ల నన్నీంటినీ
క్రమానుగతంగా వీక్షిస్తూనేవ్ వుంటావు.
ప్రభూ!!
ఒక్క సారయినా ఓరకంటితో
నిన్ను త్దేకంగా వీక్షించగల
సదవకాశాన్నిరెప్పపాటయినా నాకందించి
నన్నుధన్యుడిని గావించలేవా , ప్రభూ!!
----------------------------------------------

Tuesday, July 21, 2015

అనగా అనగా ఒకప్పుడు
గులాబీలన్నీ శ్వేతవర్ణంతో
కళ కళ లాడుతూ
గర్వంగా వికసించేవి.

ప్రణయ భావనలు ప్రపంచంలో
కాలిడాక వంచనాశిల్పుల
వైవిధ్యం విస్తరించడం అక
గులాబీ కన్నెర్ర జేయడం మొదలెట్టింది.

ఇంకా ఆకోపం,ఆవేశం ఆక్రోశం తగ్గినట్లు లేదు.
అరుణారుణార్ణవంతో
లావాలా  సెగలుగక్కుతూ
మృగాళ్ళపై నిప్పులవర్షం కురిపిస్తూనే వున్నది..
---------------------------------------------------
నీవు పట్టుచీరను చుట్టుకుంటే
పుత్తడిబొమ్మను మరిపిస్తావు.
కానీ నేను నీపై  దృష్టిని మరల్చకుండా
చూసినప్పుడల్లా పట్టుగూళ్ళను ఉడికించినప్పుడు
ప్రాణాలౌ వదులుతూ వసివాడుతుండే
పురుగులు నా గుండె గూటినంతా కెలికినట్లనిపిస్తుంది.

నీవు అందంగా నూలుచీరలు కట్టుకున్నపుడల్లా
భారతీయతకు ప్రతిరూపం నీవేనన్నట్లు భావిస్తాను.

కానీ ఆ దుస్తులను తీక్షణంగా గమనించినప్పుడల్లా
పత్తిపండించి ఆరుగాలాలపాటూ శ్రమించి
అప్పులుతీరే ఉపాయంతోచక గిట్టుబాటుకాని ధరలతో
పొలంగట్లమీదనే ఒరిగిపదే కర్షకసోదరుల
కుటుంబాలుకార్చేకన్నీటికాలువలేగుర్తొచ్చి
గుణపల్లా గుచ్చుకుంటూ వుంటాయి.

నీవు ఉన్నిదుస్తులు కప్పుకుని వచ్చినప్పుడల్లా
చలికాలంలోనులివెచ్చదనాన్నిపంచే
 నెచ్చెలివి నీవేననితలచుకుని మురిసిముక్కలవుతుంటాను.

కానీ నామనసుమాత్రమా ఉన్నితీయడంలో ఎన్నిగొర్రెలు
హింసననుభవించాయోనన్న బాధ నన్ను పరాకులో పడెస్తుంది.

అలాగని నీవు శిసిరానికి ప్రతిరూపంగా
పొందికగా నను దరిచేర్చుకుంటానురమన్నప్పుడల్లా
నీసౌందర్యానికి సిగ్గుతోతలదించుకునే హరితపత్రాల గతజీవితమేగుర్తొచ్చి  రంగురంగుల పత్రాలే
పండుటాకులై పడిపోయే శీర్ణపత్రాల శాపగ్రస్తలై భువికేతించిన
గంధర్వోప్సరోభామినులే గుర్తొచ్చి
గుణకారాలతో భాగహారాలతో వక్రంగా విస్తుపోతుంటాను.  

Sunday, July 19, 2015

అదే పదివేలు
===============
గుర్తుంచుకో ప్రియతమా!!
నువ్వడిగిన మరుక్షణం

నా ఆశలు, ఆశయాలు,లక్ష్యాలు,గమ్యాలను
ఓ పట్టికగా తయారుచేసి కొద్ది క్షణాలలో
నీకందివ్వగల నేర్పు నాకుందని మరచిపోకు!.

ఇది న్యాయమేనా అని ఒక్కసారి ఆలోచించు.
నా అపజయాల పరంపరపైనే నీవు
నీ దృష్టిని కేంద్రీకరించి నిరంతరం
నీ విలువైన సమయాన్నంతా వెచ్చించి
కంటిలోని నలుసునైనా బండరాయిప్రమాణంలో

పెద్దదిగాజేసి పదిమందిలో నన్ను పలుచనజేయాలన్న
నీతలంపు వరుసగానీవు
ఒకదానిక్రిందనింకొక దానిని ఉదాహరిస్తూ

క్షణాలు నిముషాలు,గంటలు రోజులు నెలలు
అగణితంగా వెచ్చిస్తూ నీకాలాన్ని ఎంతగా
వృధాగా ఖర్చుచేసావో మూల్;యాంకనం చేసుకో
ఏతావాతా మొత్తం మీద యేం సాధించానని
జబ్బలు చరుచుకుంటూ తలెత్తుకు ఎన్నాళ్ళు తిరగగలవో
సమ్యక్ దృష్టితో సమయానుకూలంగా పరిశీలించు చాలు అదే పదివేలు..
=============================================

చిరకాల వాంచ.
-----------------------రావెల
================================

నిశ్శబ్దం బంగారమన్నారు
ఐనా అంత ఖజానాను నాలో దాచుకునే చోటెక్కడ?

నిబద్ధత అపురూప కానుకని సెలవిచ్చారు
యేంఒ అంతటి అమూల్యమైన జ్ఞాపికను నేనేక్కడ భద్రపరచ గలను?
సహనం గొప్ప ఆభరణమని శ్లాఘించారు
దాని పుట్టు పూర్వోత్తరాలనుగూర్చి
విచారించడం ఉత్తమమని ఆశపడను.

సమ్యక్ దృప్క్పధంతో జీవనం సాగించడం
గొప్ప వరమని ఇతోధికంగా హితవు పలికారు.
అంత వరప్రాసాదాన్నందుకోగలిగిన యోగ్యతనాకు లేదని నిశ్చయించుకున్నాను.

ప్రేమించేహృదయం కలిగివుండడం  ఓ అనిర్వచనీయమైన అనుభూతని
అన్నారు
ఆమరపురాని మరువలేని అనుభవంతో నిండిన క్షణాలను
శాస్వతం చేసుకోవాలన్నదే నా చిరకాల వాంచ.

==========================================
దైనందినం
----------------
మధుమేహపు మాత్రతో నా ఫలహారం
స్వీకరించడం ప్రారంభవుతుంది.
నెత్తురుపోటుకు వేసుకోవాల్సిన బిళ్ళతో
నా మధ్యాహ్న భోజనం అయిందనిపిస్తాను.

సాయంత్రం వేడి తేనీరును ఆబగాతాగేస్తాను
వెన్వెంటనే యాంటాసిడ్ గోళీని చప్పరిస్తాను.

రాత్రయేసరికిబహుళార్ధ సాధకమైన
 "విటమిన్ గుళిక"ను
వేసుకోవడం మరిచిపోను
దాంతో రాత్రి ఆహార పచనం పూర్తవుతుంది.

చేయెత్తి శుభరాత్రంటూ
"నిద్రమాత్ర*"ను చప్పరిస్తూ
ఆదేవతఒడిలోకి నెమ్మదిగా జారుకుంటాను.
*కల్పితం 

Wednesday, July 15, 2015

ఆ వర్ణచిత్రం-----
--------------------రావెల
===========================
గోడకు స్థాణువులా వ్రేలాడుతున్న 
ఆవర్ణ చిత్రం వైపు తీక్షణంగా చూసి
ఒక్కుదుటన అప్రతిభుడనయాను. 
ఎంత మనోహరంగా తీర్చిదిద్దబడినదీ చిత్రం!!
అస్తమించే సూర్య భగవానుడివైపు 
కన్నార్పకుండా తిలకిస్తున్న ఓ వృద్ధుడు. 
అస్తమిస్తున్న సూర్యుడివైపు తదేకంగా దృష్టిని
సారిస్తూ మరో అజ్ఞాతలోకంలో 
విహరిస్తున్న అనుభూతినందుతున్న దృశ్యం అది. 
అతని హృదయమంతటా అనిర్వచనీయమైన ఆనందం.
అతని అంతరాత్మ అస్తమించేసూరుడితో తదేకమైనట్లున్నది.
అతని తనువు ఆనంద వార్ధిలో మునకలేసి తేలుతున్న వైనం.
మనసు మాత్రం సురభిళ పరిమళాలచెంతకు దౌడుతీస్తున్న అనుభూతి.

ఆవృద్ధుడిలా నేను ఆ వర్ణచిత్రం మీదనుండి దృష్టిని మరల్చలేని
వైనం నన్ను పూర్తిగా ఆధీనుడినిచేసి అలరిస్తున్నది. 
సష్టిపూర్తిని దాటేసిన నాకూ ఆ చిత్రం తో ఎందుకో అంత 
పరవశానురాగసంతుష్టి?
================================
ప్రణయవిహంగం--
===============

నేను నిరంతరం రెక్కలనాడిస్తూ
గాలి ఊసంటూ లేని ఆకాశంలో
తలక్రిందులుగా తిరిగి
రకరకాల విన్యాసాలను
గగన తలం మీద గగుర్పొడిచేలే
చేస్తూ వుంటాను.

నేనొక మృధు మధురంగా
పల్లవీకరించబడిన పాటను.
కొండల్లో కోనల్లో మాత్రమే
శబ్దరహితంగా శ్రవణ పేయంగా
ప్రతిధ్వనిస్తుంటాను.

నేను మధురాసవం నింపబడని గాజుపాత్రను
అంతరాంతరాల అంతరాత్మల్లోంచి
బుస బుసా పొంగి ప్రవహిస్తూ వుంటాను.

నేను వసంత ఋతు చ్చాయల్లేని
తరువును.
మండటం, గజగజ వణికించడం
పండుతాకులై రాలడం మాత్రమే తెలిసినజ్ఞానిని.
నేను పదాలకోసం వెదుకనవసరంలేని పద్యాన్ని
ప్రేమించే హృదయాలకు బాసటగా నిలిచే
భావగీతాన్నికూడానేనే.
ప్రణయాంతరంగాలను
పవిత్రంగా భావించి ప్రవర్తించే వారి
చుట్టూ ప్రదక్షిణలుచేసే ప్రేమామృత వర్షిణిని.
===========================
స్వప్న మాధుర్యం

------------------

నా ప్రశాంత స్వప్నాలకు
భాషాభేషజాల్లేవు.

గ్రీష్ర్తువులో అవి హాయిగా
వసంతగానం చేస్తాయి.
హేమంతంలో నులివెచ్చదనాన్ని
ఆప్యాయంగా అందిస్తాయి.
శిశిరం వచ్చేసరికి కొత్త దుస్తులకోసం
యాగీలు చేసే కురాడిలా దిశమొలతో
దేబిరించుకుని స్థాణువుల్లా నుంచుంటాయి.
వసర్తువుకు చేరువవుతుండగానే
నననవోన్మేషంగా నవ్వుతూ పలుకరిస్తాయి.

మానవీయ మూల్యాలను మహత్తుగా భావించి
హృదయపురస్సరంగా ఆలింగనం చేసుకుంటాయి.

మానవతాజయపతకలేమనమిద్దెల ఎగరాలని పదే పదే హెచ్చరిస్తాయి.
నిజాయితీ నిబద్ధత నిజమైన ఆస్తులంటూ
అసలు సిసలు నిజాన్ని ఆవిష్కరిస్తాయి.
సహనం అహింస తమకు హృదయాంతరాళాలో ప్రవహించే
నెత్తురు బిందువులని పదే పదే గుర్తు చేస్తాయి.
నా స్వప్న సీమలన్నీ జీవన గమనానికి
చేరువగా చేరి చిరంజీవులుగా మనగలగాలనే నా ఆకాంక్ష.
విన్నపాలు వినవలె--
-----------------------------రావెల
మేఘాలు
నీలి ఆకాశాన్ని ఆక్రమించి
ఆలింగనం చేసుకుంటున్నాయ్
తారాచంద్రులతో గగన సీమనంతటినీ
 తళ్కొత్తించాలన్న తపనతో.


జలజల ప్రవహించేనీరు
సముద్రునికి సాగిలబడి నమస్కరిస్తున్నది
వాన చినుకులతో మరల మరలా
భూమాతను పులకింపజేయమని అభ్యర్ధిస్తూ.


గాలిహాయిగా వింజామరలతో వీవనలు మొదలెట్టింది.

ఆరోగ్యాన్ని అందరికీ అందివ్వమని ఆదిత్యుడికి ఆహ్వానాలనదింస్తూ.


వెలుగుతున్న దీపం గాఢంగా తన సద్భావనను ప్రకటిస్తున్నది
చీకటిని కూకటి వ్రేళ్ళతో పెకలించడం ప్రారంభించండని.


భూదేవి అందరికీ వినమ్రంగా వినతులనందజేస్తున్నది
కాలుష్యపు కోరల్లో చిక్కుకోనివ్వకుండా తనను సం రక్షించమని.
===========================================
నీ ప్రేమలేఖలన్నింటినీ
శోకజలధిలోకి గిరవాటేసాను.
ఒక్కొక్క అక్షరం కంటతడిపెడుతూ
ఆలోచన సమాహారంతో ఆవేదనపడుతున్నాయి.
చిరునగవులతో మెరిసే అధరాలు
ఆత్మీయనురాగలతో పలకరించే
నీ నేత్రద్వయం
మధురాతిమధురంగా శ్వాసించే స్వప్నాలు
అన్నీ సానుభూతి పవనాల జడిలో మునకలేసాయి .
నీవుకూడా లెక్కించినట్లు లేదూ
నేనూ గమనించిన దాఖలాలేదు.
కానీ పాపం ప్రణయ పాధోరాశిమాత్రం
పరిద్Zఏవనంతో వలవలా యేద్చేసింది.
ఉప్పొంగి ప్రవహించే ఉప్పెనలనుపోలిన దు :ఖంతో.
====================================

Tuesday, July 14, 2015

నాచుట్టూ వతావరణం
శీతలమయమై నన్ను ఘనీభవింపజేస్తూ
వణికిస్తూ వుంటే
ఎగసి పడే నిప్పుకణికలకు సన్నిహితంగాచేరుకుని
కవోష్ణరుధిర ధారలకై తపిస్తాను .

అది అలాకాక ఆవిరులూదడం మొదలెడితే
ఎదురుగా వున్న ఖాళీ
గ్లాసును మంచుముక్కలతోనింపి
ఆఉష్ణాన్ని చల్లబరిచేప్రయత్నం చేస్తాను.
ప్రకృతి ఎప్పుడయినా సహాయ నిరాకరణచేస్తే
నేనేతనదగ్గరకువెళ్ళి ప్రణమిల్లి
కరుణించమని మనసారా వేడుకుంటాను.
ప్రకృతేమో నీచుట్టూ పరిభ్రమిస్తూ
పునీతంకావాలని తహ తహ పడుతుంది
.

నీవేమో ప్రకృతిచుట్టూ ప్రదక్షిణలుచేసి

ఒక పూర్ణ వలయాన్ని నిర్మిస్తూ సంతసిస్తావు.
==================================